నేడు జగన్ బెయిలు రద్దవుతుందంటూ కల్పిత కథనం.. సీఐడీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
- ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కథనంలో సూచన
- 1988 డిసెంబరు, 1991 నాటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని కథనంలో హెచ్చరిక
- ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
ముఖ్యమంత్రి బెయిలు రద్దవుతుందని, ఆ రోజున టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ కథనంలో పేర్కొన్నారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులను కూడా నమ్మవద్దని, 1988 డిసెంబరు, 1991 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయని, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆ కథనంలో పేర్కొన్నారని నేతలు పేర్కొన్నారు.