తెలంగాణలో కొత్తగా 767 కరోనా పాజిటివ్ కేసులు

13-07-2021 Tue 20:20
  • గత 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు
  • ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 10,064 మందికి చికిత్స
Telangana corona bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు నిర్వహించగా, 767 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులను గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 65, పెద్దపల్లి జిల్లాలో 59, నల్గొండ జిల్లాలో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

అదే సమయంలో 848 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,738 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో నేటివరకు 6,33,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,344 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,064 మందికి చికిత్స జరుగుతోంది.