Vijay: తమిళ స్టార్ హీరో విజ‌య్‌కి ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా విధించిన హైకోర్టు

  • 2012లో రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్న విజయ్
  • ఇంత వరకు దిగుమతి సుంకాన్ని చెల్లించని వైనం
  • రీల్ హీరోకు పన్ను కట్టడానికి మనసు రావడం లేదంటూ హైకోర్టు వ్యాఖ్య
Madras High Court fines Tamil actor Vijay

తమిళ స్టార్ హీరో విజయ్ కి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. విజయ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రీల్ హీరోకు పన్నులు కట్టడానికి మనసు రావడం లేదని... ట్యాక్స్ కట్టేందుకు వెనుకాముందు ఆడుతున్నారని విమర్శించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే  2012లో ఇంగ్లండ్ నుంచి విజయ్ ఖరీదైన రోల్స్ రాయిస్ కారును దిగుమతి చేసుకున్నాడు. అయితే, కారు దిగుమతికి సంబంధించి ఇంత వరకు ఆయన భారత ప్రభుత్వానికి పన్ను చెల్లించలేదు. అంతేకాడు, దిగుమతి పన్ను నుంచి మినహాయింపును ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో 2012లో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు దాన్ని కొట్టివేసింది. పన్ను చెల్లించాల్సిందేనని విజయ్ ని ఆదేశించింది. అంతేకాదు, పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు యత్నించినందుకు రూ. లక్ష జరిమానా విధించింది. రీల్ హీరో అంటూ విజయ్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

More Telugu News