Sputnik V: స్పుత్నిక్-వీ కమర్షియల్‌ లాంచ్ జాప్యంపై డాక్టర్‌ రెడ్డీస్ వివ‌ర‌ణ‌

  • కమర్షియల్‌ లాంచ్‌ నిలిచిపోలేదు
  • రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా అందుబాటులోకి
  • మ‌రింత విస్తృతం కానున్న‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ
sputnik v drive will begin in india

రష్యాకు చెందిన క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ వినియోగానికి భార‌త్‌లో అనుమ‌తులు ల‌భించిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల‌కు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండ‌ట్లేదు. దేశ వ్యాప్తంగా స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్న డాక్టర్‌ రెడ్డీస్ ప్ర‌తినిధులు దీనిపై స్పందిస్తూ వివ‌ర‌ణ ఇచ్చారు. స్పుత్నిక్-వీ కమర్షియల్‌ లాంచ్‌ నిలిచిపోలేదని, రాబోయే వారాల్లో  వాణిజ్యపరంగా ఇది అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తే దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత విస్తృతంగా కొన‌సాగ‌నుంది. క‌రోనాపై ఈ వ్యాక్సిన్ 91.6 శాతం ప్ర‌భావ‌శీల‌త చూపుతోందని ఇప్ప‌టికే తేలింది. దీని ఉత్ప‌త్తిని మే 14న సాఫ్ట్ పైలట్ ప్రాతిపదికన డాక్టర్ రెడ్డీస్ ప్రారంభించింది. మొద‌ట ర‌ష్యా నుంచి దిగుమ‌తి చేసుకున్న డోసుల‌ను వేస్తున్నారు. ప్ర‌స్తుతం దేశంలో ఆశించిన మేర‌కు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు.

More Telugu News