కూతురి ఫొటోను పోస్ట్ చేసిన కోహ్లీ, అనుష్క‌

12-07-2021 Mon 10:58
  • ఇంగ్లండ్‌లో విరుష్క‌
  • బిడ్డ పుట్టి 6 నెల‌లు
  • కేక్ క‌ట్ చేసిన జంట‌
anushka shares her daughter pic
త్వ‌ర‌లో ప్రారంభం కానున్న సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌ వెళ్లాడు. మ్యాచుల ప్రారంభానికి చాలా స‌మ‌యం ఉండ‌డంతో త‌న భార్య‌ అనుష్క, కూతురు వామిక‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వారితో ప‌లు ప్రాంతాల్లో తిరుగుతూ క‌న‌ప‌డుతున్నాడు. వామిక‌కు ఆరు నెలలు నిండడంతో కేక్‌ కోసి విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ‌ వేడుక చేసుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను  అనుష్క  ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోల్లోనూ వామిక ముఖం క‌న‌ప‌డ‌కుండా వారు జాగ్ర‌త్త ప‌డ్డారు. త‌మ‌ పాప ఒక్క నవ్వుతో త‌మ ప్రపంచం మొత్తాన్ని మార్చేసిందంటూ అనుష్క పేర్కొంది. త‌మ పాప అలా త‌మ‌ను చూస్తుంటే త‌మ‌ ఈ జీవితాలను ఎప్ప‌టికీ ఇలాగే హాయిగా గడిపేయొచ్చ‌ని చెప్పింది. ఆమె పుట్టి ఆరు నెలలు అవుతోందని పేర్కొంది. త‌మ పాప‌తో ఆడుకుంటూ కోహ్లీ, అనుష్క‌ హాయిగా గ‌డిపారు.