Andhra Pradesh: రాజమహేంద్రవరంలో దారుణం: అట్టపెట్టెలో చిన్నారిని వదిలివెళ్లిన వైనం.. కాపాడిన కాటికాపరి

Infant rescued in grave yard
  • శిశువు ఏడుపును గమనించి రక్షించిన కాటికాపరి
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
  • ఆరోగ్యం విషమంగా ఉందన్న వైద్యులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో తీసుకొచ్చిన శిశువును శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శిశువు ఏడుపును కాటికాపరి శివ గమనించాడు. వెంటనే చిన్నారిని చేతుల్లోకి తీసుకుని స్థానికంగా నివసించే వెంకటేశ్ దంపతులకు అప్పగించాడు. వారు వెంటనే స్థానిక ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తరలించారు.

అయితే, శిశువు పరిస్థితి విషమంగా మారడంతో 108 నియోనాటల్ అంబులెన్స్ ద్వారా కాకినాడ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)కు తరలించారు. చిన్నారి బరువు 750 గ్రాములు మాత్రమే ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఐసీడీఎస్ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు.
Andhra Pradesh
Rajamahendravaram
Infant

More Telugu News