PR Mohan: టీడీపీ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ కన్నుమూత

TDP leader PR Mohan passed away with heart attack
  • శ్రీకాళహస్తిలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్
  • మోహన్ సేవలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
టీడీపీ సీనియర్ నేత, శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తన నివాసంలో ఈ ఉదయం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాప్ చైర్మన్‌గా పనిచేసిన మోహన్.. టీడీపీలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

మోహన్ మృతి వార్త తెలిసిన వెంటనే పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. పార్టీకి మోహన్ అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పార్టీకి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. తన పాదయాత్ర విజయవంతం కావడం వెనక మోహన్ కృషి ఉందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చంద్రబాబు అన్నారు. మోహన్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు లోకేశ్ పేర్కొన్నారు. 
PR Mohan
TDP
Chandrababu
Nara Lokesh

More Telugu News