Novok Djokovic: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత నొవాక్ జకోవిచ్

Novok Djokovic wins Wimbledon mens singles title
  • వింబుల్డన్ ఫైనల్లో బెరెట్టినిపై విజయం
  • తొలి సెట్ ను కోల్పోయిన జకోవిచ్
  • ఆపై వరుసగా 3 సెట్లు కైవసం
  • కెరీర్ లో 6వ వింబుల్డన్ టైటిల్ సాధన
  • ఓవరాల్ గా జకోకు 20వ గ్రాండ్ స్లామ్

సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో ఇటలీ ఆటగాడు మటీయో బెరెట్టినిపై 6-7 (4-6), 6-4, 6-4, 6-3తో ఘనవిజయం సాధించాడు. ఈ టైటిల్ సమరంలో తొలి సెట్ ను కోల్పోయిన జకోవిచ్ ఆ తర్వాత తన ట్రేడ్ మార్కు పట్టుదల ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్ తో పాటు టైటిల్ కైవసం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ఇటలీ కుర్రాడు బెరెట్టిని ఏకంగా 16 ఏస్ లు సంధించినప్పటికీ ఫలితం లేకపోయింది. పలుమార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేయడం ద్వారా జకో ఆధిపత్యం చాటాడు. బ్రేక్ పాయింట్లను కాచుకోవడంలో బెరెట్టిని విఫలం అయ్యాడు. జకోవిచ్ 15 బ్రేక్ పాయింట్లకు గాను ఆరింట విజయవంతం కాగా, బెరెట్టిన 7 బ్రేక్ పాయింట్ల ముంగిట రెండింటిని మాత్రమే కాపాడుకున్నాడు. తొలి సెట్ ను టైబ్రేకర్ ద్వారా గెలిచిన బెరెట్టిని అదే ఊపును మిగతా సెట్లలో ప్రదర్శించలేకపోయాడు.

జకో కెరీర్ లో ఇది ఆరో వింబుల్డన్ టైటిల్ కాగా, ఓవరాల్ గా 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో, కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ సరసన ఇప్పుడు జకో కూడా చేరాడు.

  • Loading...

More Telugu News