Vishal: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన హీరో విశాల్

Hero Vishal met Vice President of India Venkaiah Naidu
  • సోదరి సమేతంగా వెంకయ్య వద్దకు విశాల్
  • సంతృప్తికరంగా భేటీ సాగిందన్న విశాల్
  • విశాల్ కు పుస్తకం బహూకరించిన వెంకయ్య
  • వెంకయ్యకు దేవుడి దీవెనలు ఉండాలన్న విశాల్
తమిళ హీరో విశాల్ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. తన సోదరితో కలిసి వెళ్లిన విశాల్... వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. దీనిపై విశాల్ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో అనేక అంశాలు చర్చించానని, ఆయనకు చెందిన ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపైనా మాట్లాడుకున్నామని విశాల్ వెల్లడించారు.

ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. వెంకయ్యనాయుడుకు భగవంతుడి దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు లభించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ భేటీ సందర్భంగా తాను రచించిన 'కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్' అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు హీరో విశాల్ కు బహూకరించారు.
Vishal
Venkaiah Naidu
Meeting
Vice President Of India
Kollywood

More Telugu News