TikTok: హైదరాబాదులో దంపతుల మధ్య టిక్ టాక్ చిచ్చు... భర్త ఆత్మహత్య

Tik Tok fascinated wife caused her husband suicide
  • ప్రవీణ్, ప్రియాంక దంపతులు
  • టిక్ టాక్ వ్యామోహంలో భార్య
  • వీడియోలు పోస్టు చేయొద్దన్న భర్త
  • ఇద్దరి మధ్య గొడవలు
  • మనస్తాపానికి గురైన భర్త ప్రవీణ్
వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ పై భారత్ లో ఎంత క్రేజుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీలు సైతం టిక్ టాక్ వీడియోలతో అలరిస్తుంటారు. అయితే, హైదరాబాదులో టిక్ టాక్ ఓ దంపతుల మధ్య చిచ్చు రేపింది. భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది.

ప్రియాంక, ప్రవీణ్ భార్యాభర్తలు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. టిక్ టాక్ లో వీడియోలు పోస్టు చేయడం ప్రియాంకకు ఓ వ్యాపకంలా మారిపోయింది. అయితే ఆమె భర్త ప్రవీణ్ అందుకు అభ్యంతరం చెప్పేవాడు. భర్త మాటను లక్ష్యపెట్టని ప్రియాంక టిక్ టాక్ లో పోస్టులు పెట్టడాన్ని కొనసాగించింది. తాను టిక్ టాక్ స్టార్ అవ్వాలని కలలుగన్న ఆమె ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై దృష్టి సారించింది.

దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు.
TikTok
Videos
Couple
Suicide
Hyderabad

More Telugu News