Mahesh Babu: మహేశ్ బాబు దత్తత గ్రామంలో సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్

Second dose corona vaccination in Mahesh Babu adapted village
  • బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత స్వీకరించిన మహేశ్ బాబు
  • అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేయూత
  • మే 31న కరోనా వ్యాక్సిన్ తొలి డోసు అందజేత
  • సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా కార్యక్రమం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మహేశ్ బాబు, నమ్రత దంపతులు చేయూతనిచ్చారు. కరోనా సంక్షోభ సమయంలోనూ మహేశ్ బాబు బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయించి, కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇప్పించారు. ఈ కార్యక్రమం మే 31న మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా చేపట్టారు.

ఇవాళ బుర్రిపాలెంలో సెకండ్ డోస్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో తొలి డోసు తీసుకున్నవారికి నేడు రెండో డోసు అందించారు. ఈ కార్యక్రమానికి విజయవాడకు చెందిన ఆంధ్రా హాస్పిటల్స్ సహకారం అందించింది.
Mahesh Babu
Burripalem
Corona Vaccination
Second Dose
Tollywood

More Telugu News