ఉత్తరప్రదేశ్‌లో అమానుషం.. కులం చెప్పాలంటూ యువకుడిపై క్రూరంగా దాడి, వీడియో వైరల్!
- యువకుడి కులం చెప్పమన్న నిందితులు
- చెప్పేందుకు నిరాకరించిన యువకుడు
- కాళ్లతో తంతూ, కర్రలతో చావబాదిన నిందితులు
వారి దెబ్బలు తాళలేని యువకుడు బాధతో విలవిల్లాడుతున్నా కనికరించలేదు సరికదా, చెట్టుకు కట్టేసి మళ్లీ దాడిచేశారు. యువకుడిని చావబాదుతున్నవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధిత యువకుడికి కాన్పూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.