CM KCR: బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

CM KCR wishes Telangana people on Bonalu festivals
  • రేపటి నుంచి బోనాలు
  • తొలి బోనం అందుకోనున్న జగదాంబిక అమ్మవారు
  • స్పందించిన సీఎం కేసీఆర్
  • అమ్మవారి దీవెనతో రాష్ట్రం ఎదిగిందని వెల్లడి
  • అన్నపూర్ణగా మారిందని వ్యాఖ్యలు
ఆషాఢ మాసం రాకను పురస్కరించుకుని భాగ్యనగరం బోనాల ఉత్సవాలకు ముస్తాబైంది. రేపు తొలిగా గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల ఉత్సవాలు తెలంగాణ సబ్బండ వర్ణాల గంగా జమునా తెహజీబ్ (సంస్కృతి) కు ప్రతీకగా నిలుస్తాయని అభివర్ణించారు.

అమ్మవారి దీవెనతో, ప్రభుత్వ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే భోజనం పెట్టే అన్నపూర్ణగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆయన ప్రార్థించారు.
CM KCR
Bonalu
Hyderabad
Telangana

More Telugu News