Kathi Mahesh: కత్తి మహేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించిన కుటుంబ సభ్యులు

Family members brought Kathi Mahesh dead body to native village
  • ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన కత్తి మహేశ్
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ఈ సాయంత్రం కన్నుమూత
  • రేపు స్వగ్రామం యలమందలో అంత్యక్రియలు
ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేశ్ కళ్లకు, తలకు బలమైన గాయాలయ్యాయి. గత కొన్నిరోజులుగా ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

కాగా, కత్తి మహేశ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు స్వస్థలానికి తరలించారు. కత్తి మహేశ్ స్వగ్రామం చిత్తూరు జిల్లాలోని యలమంద (యర్రావారిపాలెం మండలం). రేపు అక్కడ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, కత్తి మహేశ్ సినీ ప్రముఖుడిగానే కాకుండా, అనేక సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా ఎంతోమందికి దగ్గరయ్యారు. కత్తి మహేశ్ తో వివిధ వేదికలు పంచుకున్న సాహితీవేత్తలు, హక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, వివిధ రంగాలకు చెందిన ఇతరులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా "రిప్ కత్తి మహేశ్" అనే పోస్టులే దర్శనమిస్తున్నాయి.
Kathi Mahesh
Death
Yalamanda Village
Funerals
Road Accident
Andhra Pradesh

More Telugu News