CPI Ramakrishna: హైదరాబాదులో చంద్రబాబును కలిసిన సీపీఐ రామకృష్ణ

CPI AP Secretary Ramakrishna met Chandrababu in Hyderabad
  • విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై రౌండ్ టేబుల్ భేటీ
  • ఈ నెల 12న విజయవాడలో సమావేశం
  • చంద్రబాబును ఆహ్వానించిన రామకృష్ణ
  • ప్రైవేటీకరణకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడి
  • సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్
సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. విజయవాడలో నిర్వహించ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 12న విజయవాడలో అన్ని పార్టీలు, అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna
Chandrababu
Hyderabad
Vizag Steel Plant
Privatisation
Andhra Pradesh

More Telugu News