Ashleigh Barty: వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ఎగరేసుకెళ్లిన ఆస్ట్రేలియా అమ్మాయి ఆష్లీ బార్టీ

  • ఫైనల్లో ప్లిస్కోవాపై విజయం
  • 6-3, 6-7, 6-3 తో గెలుపు
  • కెరీర్ లో తొలి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ
  • 1980 తర్వాత వింబుల్డన్ లో ఓ ఆసీస్ క్రీడాకారిణి జయభేరి
Ashleigh Barty won maiden Wimbledin womens singles title

ఆస్ట్రేలియా అమ్మాయి ఆష్లీ బార్టీ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 6-7 (4-7), 6-3తో చెక్ రిపబ్లిక్ భామ కరోలినా ప్లిస్కోవాపై విజయం సాధించింది. ఆష్లీ బార్టీ కెరీర్ లో ఇదే తొలి వింబుల్డన్ టైటిల్. అంతేకాదు, 1980 తర్వాత వింబుల్డన్ లో ఓ ఆసీస్ క్రీడాకారిణి టైటిల్ నెగ్గడం ఇదే ప్రథమం.

ఈ మ్యాచ్ లో తొలి సెట్ ఆద్యంతం బార్టీ ఆధిపత్యమే సాగింది. ప్లిస్కోవా సర్వీసును బ్రేక్ చేసి అలవోకగా ఆ సెట్ ను చేజిక్కించుకుంది. అయితే రెండో సెట్ లో ప్లిస్కోవా పుంజుకోవడంతో ఆట ఆసక్తికరంగా మారింది. నువ్వానేనా అంటూ ఇద్దరూ ప్రతి గేములోనూ పోరాడడంతో ఆ సెట్ టైబ్రేకర్ దిశగా మళ్లింది. టైబ్రేకర్ లో 7-4తో ప్లిస్కోవా పైచేయి సాధించింది. దాంతో రెండో సెట్ 7-6తో ప్లిస్కోవా వశమైంది.

అప్పుడు స్కోరు 1-1తో సమం కాగా, నిర్ణయాత్మక చివరి సెట్ లో బార్టీ విజృంభించింది. పదునైన సర్వీసులు, బలమైన బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది. పలుమార్లు ప్లిస్కోవా సర్వీసును బ్రేక్ చేసిన బార్టీ 6-3తో మూడో సెట్ ను నెగ్గడమే కాదు, వింబుల్డన్ టోర్నీలో మహిళ సింగిల్స్ విజేతగా అవతరించింది.

More Telugu News