Pawan Kalyan: తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం?: పవన్ కల్యాణ్

Pawan Kalyan questions govt after Telugu Academy name changed
  • తెలుగు అకాడెమీ పేరు మార్పు
  • తెలుగు-సంస్కృత అకాడెమీగా నామకరణం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • ఎందుకు మార్చారో వివరణ ఇవ్వాలన్న పవన్
తెలుగు అకాడెమీ పేరును ఏపీ ప్రభుత్వం తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చడంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు. తెలుగు భాష అభివృద్ధి కోసం, విద్యా విషయకంగా తెలుగు భాష వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడెమీ అస్తిత్వాన్నే దూరం చేసేలా పేరు మార్చారని పవన్ విమర్శించారు. ఇప్పటికిప్పుడు తెలుగు అకాడెమీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రభుత్వం, అకాడెమీ పెద్దలు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు మార్చడం ద్వారా ఏం సాధించారని నిలదీశారు.
Pawan Kalyan
Telugu Academy
Name
AP Govt
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News