భారత్ లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలెస్ మేయర్ ను నామినేట్ చేసిన బైడెన్
- భారత్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్
- రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును నామినేట్ చేసిన అధ్యక్షుడు
- భారత్ తో బలమైన బంధాలను కోరుకుంటున్న బైడెన్
ట్రంప్ హయాంలో భారత్, అమెరికా బంధాలకు రాజకీయ రంగు కూడా తోడయింది. గత ఎన్నికల సమయంలో ట్రంప్ కు మోదీ బహిరంగంగానే మద్దతు పలికారు. అయితే, ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కాగా, బైడెన్ ఘన విజయం సాధించారు. మరోవైపు, తన హయాంలో కూడా భారత్ తో అమెరికా బంధాలు బలంగా ఉండాలని బైడెన్ కూడా కోరుకుంటున్నారు.