BCCI: భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్ ను మరోసారి మార్చిన బీసీసీఐ

  • లంక జట్టులో కరోనా కలకలం
  • సహాయక సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్
  • క్వారంటైన్ లో లంక ఆటగాళ్లు
  • సిరీస్ ను రీషెడ్యూల్ చేసిన బీసీసీఐ
  • జులై 17న ప్రారంభం అని నిన్న వెల్లడి
  • జులై 18 అంటూ ఇవాళ ప్రకటన
BCCI rescheduled India and Sri Lanka limited overs cricket series

శ్రీలంక క్రికెట్ జట్టులో బ్యాటింగ్ కోచ్, డేటా ఎనలిస్టు కరోనా బారినపడడం భారత్ తో వన్డే సిరీస్ పై ప్రభావం చూపింది. మొదట నిర్ణయించిన ప్రకారం ఈ సిరీస్ జులై 13న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే లంక జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆ జట్టు ఆటగాళ్లను క్వారంటైన్ కు తరలించారు. దాంతో సిరీస్ ను జులై 17 నుంచి నిర్వహించాలని నిన్న పేర్కొన్నారు.

అయితే, బీసీసీఐ ఈ సిరీస్ షెడ్యూల్ లో మరోసారి మార్పు చేసింది. తొలి మ్యాచ్ జులై 18న జరుగుతుందని బోర్డు ఇవాళ వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జయ్ షా ఓ ప్రకటన చేశారు. ఆతిథ్య జట్టులో కరోనా వ్యాప్తి నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ సిరీస్ లోని మూడు వన్డేలు జులై 18, 20, 23 తేదీల్లో కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఆపై జులై 25 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరగనుంది.

More Telugu News