Namitha: ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెడుతున్న నమిత

Actress Namitha starting production house
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత
  • తన తాజా చిత్రం 'భౌ భౌ' షూటింగ్ పూర్తయిందని వెల్లడి
  • త్వరలోనే 'నమిత ప్రొడక్షన్ వర్క్స్'ను ప్రారంభిస్తానన్న నమిత
సినీ నటి నమిత ఈరోజు తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పలు విషయాల గురించి మాట్లాడారు. తాను నటిస్తున్న 'భౌ భౌ' చిత్రం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే సందిగ్ధతలో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. మరోవైపు తాను సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారు.

త్వరలోనే నమిత ప్రొడక్షన్ వర్క్స్, నమిత ఓటీటీ యాప్ ను ప్రారంభించబోతున్నానని నమిత చెప్పారు. 'జెమిని' సినిమాతో వెంకటేశ్ సరసన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నమిత... ఆ తర్వాత తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. మిస్ సూరత్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత ఆమె సినీరంగ ప్రవేశం చేశారు. 2017లో తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నమిత నటిస్తూనే ఉన్నారు. తమిళనాట నమితకు చాలా ఫాలోయింగ్ ఉంది. అభిమానులు ఆమెకు గుడిని కూడా కట్టించారు.
Namitha
Tollywood
Kollywood
Production

More Telugu News