Viral Videos: డ్ర‌గ్స్ నిందితుల‌ను అరెస్టు చేసేందుకు వ‌చ్చిన పోలీసులు.. అడ్డుప‌డుతూ స్థానికులు నానా హంగామా.. వీడియో ఇదిగో

 neighbours of some drug peddlers manhandled a Police team
  • పోలీసుల‌ను తోసేసి, వెన‌క్కి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నాలు
  • నిందితులు పారిపోయేందుకు స‌హ‌క‌రించాల‌నుకున్న స్థానికులు
  • హ‌ర్యానాలోని ఫ‌తేహాబాద్‌ బాజిగ‌ర్ బ‌స్తీలో ఘ‌ట‌న
  • చివ‌ర‌కు అరెస్టు చేసిన పోలీసులు
మాద‌క ద్రవ్యాలు అమ్ముతోన్న వారిని అరెస్టు చేయ‌డానికి పోలీసులు వెళ్లారు. పోలీసుల‌ను చూసిన నిందితుల కుటుంబ స‌భ్యులు, స్థానికులు అరెస్టుకు అడ్డుప‌డుతూ నానా హంగామా చేశారు. పోలీసుల‌ను తోసేస్తూ, వెన‌క్కి వెళ్ల‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేశారు. అలా చేసి నిందితులు పారిపోయేందుకు స‌హ‌క‌రించాల‌నుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌హిళ‌లు కూడా పోలీసుల‌ను తోసేస్తూ దూషిస్తూ రెచ్చిపోయారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలోని ఫ‌తేహాబాద్‌ బాజిగ‌ర్ బ‌స్తీలో చోటు చేసుకుంది. చివ‌ర‌కు పోలీసులు వారంద‌రినీ ఎదుర్కొని నిందితుల‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లారు.
Viral Videos
Haryana

More Telugu News