Prime Minister: కల్యాణ్ సింగ్ కోలుకోవాలని దేశమంతా కోరుకుంటోంది: ప్రధాని నరేంద్ర మోదీ

Countless Indians Praying For Kalyan Singhs Speedy Recovery wishes PM
  • యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ ఆరోగ్యంపై వాకబు
  • ఆయన మనవడికి ఫోన్
  • జ్ఞాపకాలు గుర్తొచ్చాయన్న ప్రధాని
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా ఆయన లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన్ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై మోదీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

తాజాగా మోదీ కల్యాణ్ సింగ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన మనవడితో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలోని ఎంతో మంది ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. నిన్న జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు వెళ్లినప్పుడు నడ్డాను నా గురించి అడిగారని తెలుసుకుని చలించిపోయాను. ఆయనతో నాకున్న జ్ఞాపకాలు అలాంటివి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఆయనతో మాట్లాడితే ఎన్నో నేర్చుకోవచ్చు. ఆరోగ్యం గురించి ఆయన మనవడితో నేను మాట్లాడాను’’ అని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన మెరుగవుతున్నారని చెప్పారు. రక్త పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. అన్ని విభాగాలకు చెందిన వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
Prime Minister
Narendra Modi
Uttar Pradesh
Kalyan Singh

More Telugu News