Kakani Govardhan: చంద్రబాబు దగా చేస్తే.. జగన్ ఆదుకుంటున్నారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Chandrababu cheated farmers says Kakani Govardhan
  • రైతు సంక్షేమంపై చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారు
  • రుణమాఫీ చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారు
  • పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు
తమ ప్రభుత్వం చేస్తున్న రైతు సంక్షేమంపై టీడీపీ అధినేత చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల హృదయాల్లో వైయస్సార్ నిలిచిపోయారని... అందుకే వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయకుండా చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. అయితే జగన్ మాత్రం రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని అన్నారు.

రైతులకు పంటబీమా ఇవ్వలేక గత టీడీపీ ప్రభుత్వం చతికిలపడితే... పంట దిగుబడి తగ్గినా బీమా వచ్చేలా జగన్ చర్యలు తీసుకున్నారని కాకాణి కొనియాడారు. పంటబీమా గురించి మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదని అన్నారు. మిల్లర్లతో చేతులు కలిపి రైతులను టీడీపీ నేతలు ముంచేశారని చెప్పారు. రైతులను మోసం చేసిన చరిత్ర టీడీపీదని, వైసీపీ ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడాన్ని ఇకనైనా మానుకోవాలని అన్నారు. నీతి, నిజాయతీ ఉంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని కాకాణి సవాల్ విసిరారు.
Kakani Govardhan
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News