ముగ్గురు హీరోయిన్లతో ధనుశ్ రొమాన్స్!

09-07-2021 Fri 10:38
  • మిత్రన్ జవహర్ తో ధనుశ్ 
  • ఇద్దరి కాంబినేషన్లో నాల్గొవ సినిమా
  • కథానాయికలుగా హన్సిక, నిత్య, ప్రియా
  • త్వరలోనే మిగతా వివరాలు  
Dhanush latest movie with three heroines

కోలీవుడ్లో ఏ మాత్రం గ్యాప్ రానీయకుండా వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ వెళ్లే హీరోల్లో సూర్య .. ధనుశ్ ముందువరుసలో కనిపిస్తారు. కంటెంట్ కి ధనుశ్ మరింత ప్రాధాన్యతను ఇస్తాడు. కథ కోసం .. పాత్ర కోసం తెరపై ఎలా కనిపించడానికైనా ధనుశ్ వెనుకాడడు. ప్రయోగాత్మక పాత్రలను ఆయన చాలా నమ్మకంతో చేస్తాడు. అందువల్ల కథ కొత్తగా అనిపించిన దర్శక నిర్మాతలు ముందుగా ఆయననే సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి ధనుశ్ ఇప్పుడు తన 44వ సినిమాకి సంబంధించిన పనుల్లో ఉన్నాడు.

ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించనున్నాడు. కథాపరంగా ఈ సినిమాలో ధనుశ్ ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేస్తాడట. ఆ కథానాయిక పాత్రల కోసం హన్సిక .. నిత్యామీనన్ .. ప్రియా భవానిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మిత్రన్ ఇంతకుముందు ధనుశ్ తో 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' .. 'ఆర్య' .. 'రెడీ' సినిమాలను తమిళంలో రీమేక్ చేశాడు. ఈ మూడు రీమేకులు కూడా అక్కడ బాగానే ఆడాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్లో 4వ సినిమా రూపొందుతోంది. మరో ఇది స్ట్రైట్ సినిమానా? లేదంటే ఏదైనా తెలుగు సినిమాకి రీమేకా? అనేది చూడాలి.