DK Aruna: కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ అమ్మేశారు: డీకే అరుణ

KCR sold Krishna water to Jagan says DK Aruna
  • కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఇద్దరు సీఎంలకు ఒప్పందం ఉంది
  • నదీ జలాలపై కేసీఆర్ ది దొంగ నాటకమే
  • హుజూరాబాద్ ఎన్నిక కోసం సెంటిమెంట్ ను రగిల్చే కుట్ర చేస్తున్నారు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. కృష్ణా జలాలను నీవు తీసుకుపో... గోదావరి జలాలను నేను తీసుకుపోతా.. అనేలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ పెద్ద ద్రోహం చేశారని... కృష్ణా నీటి పంపకాల్లో 299 టీఎంసీల నీటికి ఒప్పుకుని రావడమే ఆయన చేసిన తప్పని దుయ్యబట్టారు.

కృష్ణా జలాలపై కేసీఆర్ ది దొంగ నాటకమేనని అరుణ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి సెంటిమెంట్ ను రగిల్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గట్టు మండలం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని... అక్కడ గట్టు లిఫ్ట్ కు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే... వాటిని పక్కన పెట్టి డిజైన్లను మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల నుంచి గంప మట్టి కూడా తీయలేదని అన్నారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు.
DK Aruna
BJP
KCR
TRS
Jagan
YSRCP

More Telugu News