Hyderabad: నిన్న ర్యాలీ నిర్వ‌హించినందుకు అంజ‌న్ కుమార్ యాద‌వ్‌పై కేసు

Hyderabad Police booked Anjan Kumar Yadav
  • నిన్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యల స్వీకారం  
  • ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డార‌న్న పోలీసులు
  • అనుమ‌తి లేకుండా ర్యాలీ నిర్వ‌హించార‌ని కేసు
టీపీసీసీ అధ్య‌క్షుడిగా నిన్న ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ నేత‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితుడైన అంజన్ కుమార్ యాదవ్ కూడా నిన్న ప‌లు ఆల‌యాల్లో పూజ‌లు చేసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ప‌లు ప్రాంతాల నుంచి  కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ గాంధీభవన్ చేరుకున్నారు. కాంగ్రెస్ నేత‌లు భారీ జనసమీకరణకు పిలుపునివ్వ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగాయి. దీంతో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పై హైద‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆయ‌న అనుమ‌తులు లేకుండా ర్యాలీ నిర్వ‌హించార‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగాయ‌ని పోలీసులు తెలిపారు.
Hyderabad
Congress
Telangana
Revanth Reddy
Anjan Kumar Yadav

More Telugu News