Narendra Modi: మోదీ 2.0 కేబినెట్​.. అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాలకూ అవకాశం.. ఇదీ టీమ్​!

Modi Cabinet Will Have Equal Opportunities To All Communities
  • 43 మందికి కొత్తగా చోటు
  • 12 మంది ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలకు అవకాశం
  • 27 మంది ఓబీసీలకు పదవి
  • 25 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం
  • కేబినెట్ లో చదువుకున్న వారూ ఎక్కువే
ప్రధాని నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా చేస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇది. ఈసారి మంత్రివర్గంలో అన్ని వర్గాల వారికి ఎన్డీఏ సర్కారు సమ ప్రాధాన్యం ఇచ్చింది. చెప్పుకోదగిన రీతిలో మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 43 మంది మంత్రులతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పెద్ద చదువులున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది.

కొత్త కేబినెట్ లో వీరు...

  • 11 మంది మహిళలకు చోటు
  • 12 మంది దళితులకు చోటు. అందులో ఇద్దరికి ఫుల్ కేబినెట్ హోదా
  • 27 మంది ఓబీసీలకు చోటు. 19 వెనుకబడిన కులాల నుంచి ప్రాతినిధ్యం. అందులో ఐదుగురికి కేబినెట్ హోదా.
  • ఏడు వేర్వేరు గిరిజన తెగల నుంచి 8 మంది ఎస్టీలకు అవకాశం
  • ఐదుగురు మైనారిటీలకు మంత్రి పదవి
  • బ్రాహ్మణులు, భూమిహార్, కాయస్థ, క్షత్రియ, లింగాయత్, పటేల్, మరాఠా, రెడ్డి వర్గాలకు చెందిన 29 మందికి మంత్రి పదవులు.
  • మంత్రివర్గంలో 14 మంది 50 ఏళ్ల లోపు వారే. అందులో ఆరుగురికి కేబినెట్ బెర్త్ .
  • మంత్రివర్గ విస్తరణ తర్వాత మోదీ టీమ్ సగటు వయసు 58 ఏళ్లు.
  • కేబినెట్ లో 46 మందికి వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం
  • 23 మంది మూడు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ఎంపీగా గెలిచినవారే. దశాబ్ద కాలానికి పైగా అనుభవం
  • కొత్త కేబినెట్ లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులకు అవకాశం.
  • 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం. దాదాపు దేశం నలుమూలలకు చెందిన వారికి అవకాశం.
  • ఐదుగురు మంత్రులు ఈశాన్య రాష్ట్రాల వారు.

మంత్రుల చదువు..

ఏడుగురు మంత్రులు పీహెచ్ డీ చేశారు. ముగ్గురు ఎంబీఏ, 13 మంది లాయర్లున్నారు. ఆరుగురు వైద్యులు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు, 68 మంది డిగ్రీ చదివిన వారున్నట్టు సమాచారం.
Narendra Modi
Prime Minister
Cabinet Re Shuffle

More Telugu News