Revanth Reddy: టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్​

  • భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
  • ఉత్తమ్, భట్టి, సీనియర్ నేతల హాజరు
  • కాసేపట్లో బహిరంగ సభ
  • సందడిగా మారిన గాంధీభవన్
Revanth Takes Over Charge As New TPCC President

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో నేతలు, రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. ముందుగా అనుకున్న ముహూర్తానికి అనుగుణంగా ఇవ్వాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన టీపీసీసీ పగ్గాలను అందుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

అసంతృప్తులు అనుకున్న నేతలూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి తదితర సీనియర్ నేతలు రేవంత్ బాధ్యతల స్వీకారానికి హాజరయ్యారు.

ఇప్పటికే గాంధీభవన్ లో రేవంత్ కు అనుగుణంగా వాస్తు మార్పులను చేశారు. సీఎల్పీ నేత భట్టి చాంబర్, ఇంతకుముందు పీసీసీ చీఫ్ చాంబర్ కు పక్కనే ఉన్న మీటింగ్ హాల్ ను కలిపి రేవంత్ చాంబర్ గా మార్చారు. ఇంతకు ముందు ఉత్తమ్ మూసేయించిన గేట్ నూ తెరిచి రెండు గేట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

కాగా, రేవంత్ పదవీ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద కోలాహలం నెలకొంది. మరికొద్ది సేపట్లో నిర్వహించనున్న బహిరంగ సభలో రేవంత్ మాట్లాడనున్నారు.

More Telugu News