సెకండ్ డోస్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలి: జగన్
- కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారం
- వ్యాక్సిన్ కు సంబంధించి మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది
- రైతు భరోసా చైతన్య యాత్రలను నిర్వహించండి
ప్రతి నెల మొదటి శుక్రవారం ఆర్బీకే స్థాయిలో, రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి సమావేశాలను నిర్వహించాలని జగన్ సూచించారు. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు రైతు భరోసా చైతన్య యాత్రలను నిర్వహించాలని అన్నారు. సీఎం యాప్ పనితీరు, ఆర్బీకేల విధివిధానాలు, ఈక్రాపింగ్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు.