Tapsee: తాప్సీ ప్రధాన పాత్రలో 'మిషన్ ఇంపాజిబుల్'

Tapsee movie update
  • గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్ 
  • బాలీవుడ్ లో నటన ప్రధానమైన పాత్రలు 
  • 'మిషన్ ఇంపాజిబుల్' తో రీ ఎంట్రీ 
  • దర్శకుడిగా స్వరూప్
తెలుగు తెరకి పరిచయమైన గ్లామరస్ కథానాయికలలో తాప్సీ ఒకరు. ఇక్కడ అన్నీ కూడా ఆమెకి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే దక్కాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా కొన్ని సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆమెకి ఇక్కడ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ ఇండస్ట్రీని ఒకసారి అలా టచ్ చేసి, ఆ తరువాత బాలీవుడ్ కి మకాం మార్చేసింది.

అక్కడ తనవంతు ప్రయత్నాలు చేస్తూ వెళ్లింది. బాలీవుడ్ లో నిలదొక్కుకోవడం అంటే అంత తేలికైన విషయమేం కాదు. ఇలా వెళ్లి అలా వచ్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అక్కడ విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. కథాపరంగా .. పాత్ర పరంగా అక్కడ ప్రయోగాలు చేయాలనుకునేవారికి ముందుగా గుర్తొచ్చే పేరు తాప్సీనే. బాలీవుడ్ లో నటన ప్రధానమైన పాత్రల ద్వారా తానేమిటనేది నిరూపించుకున్న తాప్సీ, మళ్లీ ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తోంది .. దాని పేరే 'మిషన్ ఇంపాజిబుల్. 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించిన, స్వరూప్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
Tapsee
Swaroop
Tollywood

More Telugu News