KTR: 6 లేన్లతో నిర్మించిన 'బాలాన‌గర్' ఫ్లై ఓవర్‌ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  • కార్య‌క్ర‌మంలో పాల్గొన్న త‌ల‌సాని, మ‌ల్లారెడ్డి
  • ఎస్ఆర్డీపీలో భాగంగా పైవంతెన నిర్మాణం
  • రూ.387 కోట్ల వ్య‌యంతో 1.13 కిలోమీట‌ర్ల మేర‌  వంతెన  
  • ఎల్‌ఈడీ వీధిలైట్ల అమ‌రిక‌
Minister KTR inaugurates Balanagar Flyover

హైదరాబాద్‌లో ఎల్ల‌ప్పుడూ వాహ‌నాల‌ ర‌ద్దీ ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒక‌టి. వాహ‌న‌దారులు ఆ చౌర‌స్తా మీదుగా వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవారు. వారి ఇబ్బందుల‌ను తొల‌గించేందుకు నిర్మించిన ఫ్లైఓవ‌ర్ నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మంత్రులు, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఇదే.

రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మ‌క రోడ్డు అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా హెచ్ఎండీఏ ఈ పైవంతెనను నిర్మించింది. ప్ర‌స్తుతం నెల‌కొంటోన్న ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌తో పాటు రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి 2017 ఆగ‌స్టులో మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

రూ.387 కోట్ల వ్య‌యంతో 1.13 కిలోమీట‌ర్ల మేర ఈ వంతెన నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్‌, వాటిలో పూల మొక్కలు నాటారు. అలాగే, ఎల్‌ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెన వ‌ల్ల‌ సికింద్రాబాద్‌-కూకట్‌పల్లి-అమీర్‌పేట-జీడిమెట్ల వైపునకు వాహ‌నాలు ఎలాంటి చిక్కులు లేకుండా వెళ్లే వెసులుబాటు కూడా కలుగుతుంది.



.

More Telugu News