Aishwarya Rajesh: నమ్మిన వ్యక్తే మోసం చేశాడట.. ఐశ్వర్య రాజేశ్ ఆవేదన

One person betrayed me says Aishwarya Rajesh
  • డబ్బులు తీసుకుని నా విషయాలను లీక్ చేశాడు
  • నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు
  • ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు

తమిళ, తెలుగు సినిమాలలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. అలనాటి తెలుగు హీరో రాజేశ్ కుమార్తె ఐశ్వర్య అనే విషయం తెలిసిందే. అయితే, తాను ఎంతో నమ్మిన వ్యక్తే తనను వంచించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, తనకు సంబంధించిన విషయాలను లీక్ చేశాడని... ఆ విషయాన్ని తెలుసుకుని తాను షాక్ కు గురయ్యానని చెప్పింది. తన వెంటే ఉంటూ తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు తనకు సలహా ఇచ్చారని.. అయితే, తప్పు అప్పటికే జరిగిపోయిందని చెప్పింది. ఇకపై తానే జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఐశ్వర్య తెలిపింది.

అయితే, ఆ వ్యక్తికి తాను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని... ఇలాంటి నమ్మకద్రోహాలు మరొకరికి చేయవద్దని సూచిస్తున్నానని చెప్పింది. ఇలాంటి వ్యక్తులు కొందరు చేసే పనుల వల్ల ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. అయితే, జాగ్రత్తగా ఉండాలనే విషయం మాత్రం అర్థమయిందని చెప్పింది.

  • Loading...

More Telugu News