రెండేళ్లలో కోటి మందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్‌దే: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి చేసిన మోసం వల్లే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా చనుగొండ్లలో నిరుద్యోగి గోపాల్ ఆత్మహత్య బాధాకరమని ఆయన అన్నారు. గోపాల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండేళ్లలో రాష్ట్రంలో కోటి మందికి ఉపాధి పోగొట్టిన ఘనత జగన్‌దేనని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చుకోవడంలో జగన్ విఫలమయ్యారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి వంగి నమస్కారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర యువతను జగన్ మభ్యపెడుతూ దగా చేశారని ఆయన అన్నారు.