మోదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని

Bangladeshi PM Sheikh Hasina sends 2600 kg mangoes as gift to PM Modi
  • ‘హరిబంగ’ రకం మామిడి పండ్లను పంపిన షేక్ హసీనా
  • కోల్‌కతాలోని బంగ్లాదేశ్ అధికారులకు అందిన పండ్లు
  • రాష్ట్రపతి, ప్రధాని, మమత బెనర్జీ సహా ఇతర నేతలకు పంపిణీ
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్రమోదీకి మామిడి పండ్లను బహుమతిగా పంపారు. 2600 కేజీల ‘హరిబంగ’ రకం మామిడి పండ్లను బంగ్లాదేశ్ నుంచి ఓ ట్రక్కులో పంపించారు. భారత్‌తో స్నేహ సంబంధాలకు గుర్తుగా హసీనా వీటిని పంపినట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ అధికారులకు అందిన ఈ మామిడి పండ్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సహా ఇతర రాజకీయ నేతలకు పంపిణీ చేయనున్నారు.
Go Back to Shorts
Bangladesh
Sheikh Hasina
Narendra Modi
Mangoes

More Telugu News