Madhurabai: పోయిన కంటి చూపు కరోనా టీకా వేయించుకుంటే తిరిగొచ్చింది!

  • 9 ఏళ్ల కిందట కంటి ఆపరేషన్ విఫలం 
  • కంటిచూపు పోయిన వైనం
  • ఇటీవలే కరోనా టీకా తీసుకున్న వృద్ధురాలు
  • మరుసటి రోజు నుంచే కళ్లు కనపడడం ప్రారంభం
  • కారణం తెలుసుకునేందుకు వైద్యుల పరీక్షలు 
Old woman gets eyesight after taken corona vaccine

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళకు కంటిచూపు తిరిగొచ్చిన వైనం మహారాష్ట్రలో వెలుగుచూసింది. మధురబాయి బిదవే వయసు 70 ఏళ్లు. వాసిం ప్రాంతంలో నివసిస్తోంది. ఆమె 9 సంవత్సరాల కిందట కంటి శుక్లాలకు శస్త్రచికిత్స చేయించుకుంది. దురదృష్టం కొద్దీ శస్త్రచికిత్స విఫలం చెందడంతో ఆమె కంటిచూపు పొగొట్టుకుంది. అప్పటినుంచి ఇతరులపై ఆధారపడి నెట్టుకొస్తోంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల మధురబాయి కొవిషీల్డ్ టీకా వేయించుకుంది. జూన్ 26న ఆమె వ్యాక్సిన్ తీసుకోగా, ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి రోజు నుంచే కళ్లు కనిపించడం ప్రారంభించాయి. ఈ ప్రాంతంలో ఇదొక వింతగా మారింది. దాంతో మధురాబాయిని కంటి వైద్యులు పరీక్షించారు. వ్యాక్సిన్ కారణంగా ఇలా జరిగిందా? లేక, మరే ఇతర కారణమైనా ఉందా? అని తెలుసుకునేందుకు ఆమెకు మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఏదేమైనా ఎప్పుడో పోయిన కంటిచూపు ఇన్నాళ్లకు తిరిగిరావడం పట్ల మధురాబాయి ఆనందం అంతాఇంతా కాదు.

More Telugu News