Balka Suman: హుజూరాబాద్ ఉపఎన్నిక మోదీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుంది: బాల్క సుమన్

Balka Suman comments on Huzurabad by polls
  • త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక
  • టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
  • బండి సంజయ్ విమర్శలు
  • కొత్త బిచ్చగాడు అంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. హుజూరాబాద్ ఉపఎన్నికను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, ఈటల వెనుక మోదీ ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ దీటుగా బదులిచ్చారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక మోదీ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతుందని వ్యాఖ్యానించారు. 'కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడట' అంటూ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేయాలని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణ దొంగలు, మోసగాళ్ల చేతికి చిక్కి ప్రజలు మోసపోవద్దని అన్నారు.
Balka Suman
Huzurabad
By Election
Bandi Sanjay
Eatala Rajendar
Narendra Modi
BJP
TRS

More Telugu News