Varun Sandesh: 'ఇందువదన' నుంచి 'వడివడిగా ..' లిరికల్ వీడియో!

  • వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ 
  • కొత్త హీరోయిన్ పరిచయం
  • సంగీత దర్శకుడిగా శివ కాకాని 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Induvadana lyrical video released

వరుణ్ సందేశ్ కెరియర్ ఆరంభంలోనే హిట్స్ కొట్టాడు .. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వలన పరాజయాలు పలకరించాయి. దాంతో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. కొంత గ్యాప్ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయన ఒక ప్రేమకథా చిత్రంలో నటించాడు. ఆ సినిమా పేరే 'ఇందువదన'. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ సినిమాకి ఎమ్మెస్సార్ దర్శకుడిగా వ్యవరించాడు. ఈ సినిమాతో కథానాయికగా ఫర్నాజ్ శెట్టి పరిచయమవుతోంది.కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. 'వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా' అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ఓ సెలయేటి ఒడ్డున ఈ పాటను అందంగా చిత్రీకరించారు. మోడ్రన్ లుక్ తో హీరో .. గిరిజన యువతిగా హీరోయిన్ కనిపిస్తున్నారు. శివ కాకాని సంగీతాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ .. మాళవిక ఆలపించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రీ ఎంట్రీలోనైనా వరుణ్ సందేశ్ నిలదొక్కుకుంటాడేమో చూడాలి.

More Telugu News