Sudheer Reddy: గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్: రేవంత్ రెడ్డికి సుధీర్ రెడ్డి వార్నింగ్

Sudheer Reddy warns Revanth Reddy
  • రేవంత్ రెడ్డి గూండా మాదిరి మాట్లాడుతున్నారు
  • ప్రచారం కోసం బజారు భాష వాడుతున్నారు
  • సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు మేమెప్పుడూ చెప్పలేదు
టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి, పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలని రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఇదే సమయంలో ఆయనపై టీఆర్ఎస్ నేతలు విమర్శలను ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ రెడ్డి గూండా మాదిరి మాట్లాడుతున్నారని... ఆయన ఇదే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరూ మిగలరని అన్నారు. ప్రచారం కోసం బజారు భాష మాట్లాడుతున్నారని... ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడరని చెప్పారు. గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్ అని హెచ్చరించారు.
 
సీఎల్సీ అంటే తమ అబ్బ సొత్త కాదు, రేవంత్ అబ్బ సొత్తు కాదని సుధీర్ అన్నారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఒక గ్రూపు ఎమ్మెల్యేలం మాత్రమే టీఆర్ఎస్ లో విలీనమయ్యామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరని విమర్శించారు. 2017లో రాజీనామా చేసినట్టు స్పీకర్ కు రేవంత్ రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Sudheer Reddy
TRS
Revanth Reddy
Congress

More Telugu News