Republic: కాస్త కొత్తగా... తొలి పాట మ్యూజిక్ సిట్టింగ్స్ ను పంచుకున్న 'రిపబ్లిక్' చిత్రబృందం

Republic unit released first single music sittings video
  • మ్యూజిక్ సిట్టింగ్స్ వీడియో రిలీజ్
  • మొదట పాట రాయించిన దర్శకుడు దేవా కట్టా
  • ఆపై బాణీలు కట్టిన మణిశర్మ
  • అలరించే దృశ్యాలతో వీడియో
మెగాహీరో సాయితేజ్ ప్రధానపాత్రలో వస్తున్న చిత్రం రిపబ్లిక్. దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వీడియో విడుదలైంది. ఇది రిపబ్లిక్ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ దృశ్యాలున్న వీడియో.

దేశభక్తితో కూడిన హుషారైన గీతం రాయాలని దర్శకుడు దేవా కట్టా లిరిక్ రైటర్ రెహ్మాన్ కు వివరించే సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఆపై రెహ్మాన్ పాట రాయడం, దాన్ని సంగీత దర్శకుడు మణిశర్మకు చూపించడం, ఆయన ట్యూన్లు లేకుండా పాట ఎలా రాశారంటూ ఆశ్చర్యపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఆపై, ఉత్తేజం కలిగించే బాణీలతో ఆ సాహిత్యాన్ని మణిశర్మ హార్మోనియంపై ఆలపించడం ఆద్యంతం ఆసక్తికరంగా చూపించారు.

'గానా ఆఫ్ రిపబ్లిక్' పేరిట ఈ వీడియోను చిత్రబృందం ఇవాళ రిలీజ్ చేసింది. వీడియో ఫుటేజి వినూత్నంగా ఉండడంతో సినీ ప్రేమికుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ పాటను జులై 11ను విడుదల చేయనున్నారు. జేబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయితేజ్ సరసన ఐశ్వర్య రాజేశ్ కథానాయిక.
Republic
Saitej
Music Sittings
Deva Katta
Manisharma
Rahman
Video
Tollywood

More Telugu News