SBI: కరోనా థర్డ్ వేవ్ ఖాయమంటున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

  • దేశంలో థర్డ్ వేవ్ పై ఎస్బీఐ నివేదిక
  • ఆగస్టులో ఊపందుకుంటుందని వెల్లడి
  • సెప్టెంబరు నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని అంచనా
  • 1.7 రెట్లు అధికంగా కేసులు నమోదవుతాయని వెల్లడి
SBI release its report on corona third wave estimations

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశంలో కరోనా వ్యాప్తి తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. తాజాగా కరోనా థర్డ్ వేవ్ పై ఎస్బీఐ నివేదిక రూపొందించింది. ఆగస్టులో కరోనా మూడో వేవ్ ప్రారంభం కావొచ్చని, సెప్టెంబరు నాటికి పతాకస్థాయికి చేరుకుంటుందని పేర్కొంది. 'కొవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్' పేరిట రూపొందించిన ఈ నివేదికను ఎస్బీఐ తాజాగా విడుదల చేసింది.

ఆగస్టు రెండో వారం నుంచి థర్డ్ వేవ్ సూచనలు బలంగా కనిపిస్తాయని, కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని బ్యాంకు వెల్లడించింది. థర్డ్ వేవ్ వస్తే కరోనా కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని హెచ్చరించింది. సెకండ్ వేవ్ తో పోల్చితే కేసుల సంఖ్య 1.7 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని వివరించింది. నెల రోజుల వ్యవధిలోనే కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠ వ్యాప్తిని అందుకుంటుందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది.

దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఆర్ధిక రంగ కార్యకలాపాలు, దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై వైరస్ ప్రభావం ఎలా ఉంటోందన్న అంశాల పట్ల ఎస్బీఐ పరిశోధనాత్మక రీతిలో అధ్యయనం చేపట్టి నివేదికలు రూపొందిస్తోంది.

More Telugu News