Maharashtra: మహారాష్ట్రలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్

Twelve BJP MLAs fired for one year from Maharashtra Assembly
  • మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
  • నేడు సమావేశమైన ఆసెంబ్లీ
  • తొలిరోజే వాడీవేడి పరిణామాలు
  • బీజేపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వ ఆగ్రహం
  • ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణ
మహారాష్ట్ర రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్ తో బీజేపీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ  కారణంగానే వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు తీసుకువచ్చిన తీర్మానానికి ఆమోదం లభించింది.

బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, ఆశిష్ షేలార్, అభిమన్యు పవార్, గిరీశ్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరాగ్ అల్వానీ, హరీశ్ పింపాలే, రామ్ సత్పుతే, విజయ్ కుమార్ రావల్, యోగేశ్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్దియాలపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రెండ్రోజుల వర్షాకాల సమావేశాల నిమిత్తం మహారాష్ట్ర అసెంబ్లీ నేడు సమావేశం కాగా, తొలిరోజే వాడీవేడి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Maharashtra
Assembly
BJP MLAs
Suspension

More Telugu News