Anil Kumble: సీఎం జగన్ ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

Anil Kumble meets AP CM Jagan
  • తాడేపల్లిలో జగన్ ను కలిసిన కుంబ్లే
  • జగన్ కు పుష్పగుచ్ఛం, జ్ఞాపికను అందించిన జగన్
  • మర్యాద పూర్వకంగానే కలిశారన్న వైసీపీ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను భారత్ దిగ్గజ స్పిన్ బౌలర్, మాజీ టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ తో కరచాలనం చేసిన కుంబ్లే... ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందించారు. మర్యాదపూర్వకంగానే జగన్ ను టీమిండియా మాజీ కెప్టెన్ కుంబ్లే కలిసినట్టు వైసీపీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Anil Kumble
Team India
Jagan
YSRCP

More Telugu News