Mehreen Pirzada: మెహ్రీన్ నుంచి విడిపోతున్నందుకు ఎలాంటి బాధ లేదు: మాజీ ప్రియుడు భవ్య బిష్ణోయ్

Not feeling bad about departing from Mehreen Pirzada says Bhavya Bishnoi
  • భవ్యతో ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లిన మెహ్రీన్ ప్రేమాయణం
  • భవ్య కుటుంబం మెహ్రీన్ కు గౌరవం ఇవ్వలేదని వార్తలు
  • అభిప్రాయ బేధాల వల్లే విడిపోయామన్న భవ్య బిష్ణోయ్
సినీ నటి మెహ్రీన్ ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లలేకపోయిన సంగతి తెలిసిందే. ఎంగేజ్ మెంట్ తోనే ఆమె ప్రేమ బ్రేకప్ అయిపోయింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ ని మెహ్రీన్ ప్రేమించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

అయితే కరోనా నేపథ్యంలో, తమ వివాహాన్ని కొంత కాలం వాయిదా వేస్తున్నామని ఆమె ప్రకటించింది. ఈ మధ్యలో ఏమయిందో కానీ... తాము పెళ్లి చేసుకోవడం లేదని, భవ్య బిష్ణోయ్ కుటుంబంతో ఇక తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇలా హఠాత్తుగా వీరి వివాహం రద్దు కావడంతో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మెహ్రీన్ కి బిష్ణోయ్, అతని కుటుంబం సరైన విలువ ఇవ్వలేదని, అందుకే ఆమె ఆ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో భవ్య బిష్ణోయ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని, అందుకే దూరం కావాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.

ఈ నెల 1న ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. మెహ్రీన్ పరిచయం అయినప్పటి నుంచి ఆమెను తాను ఎంతో ప్రేమించానని చెప్పాడు. తమ కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎంతో గౌరవించారని తెలిపాడు. తమ ఇద్దరిది మంచి జోడీ అవుతుందని అనుకున్నామని... కానీ కాలం తమ జీవితాలను వేరు చేసిందని చెప్పాడు. మెహ్రీన్ నుంచి విడిపోతున్నందుకు తాను బాధ పడటం లేదని అన్నాడు.

మెహ్రీన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని బిష్ణోయ్ తెలిపాడు. తన కలలన్నింటినీ మెహ్రీన్ సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నాడు. తనను కానీ, తన కుటుంబాన్ని కానీ విమర్శించేలా కామెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. మెహ్రీన్ ప్రేమానురాగాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పాడు.
Mehreen Pirzada
Tollywood
Boy Friend
Bhavya Bishnoi

More Telugu News