Krishna District: తెలంగాణ హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్ వేసిన కృష్ణా జిల్లా రైతు

  • తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తోంద‌న్న పిటిష‌న‌ర్
  • గ‌త నెల 28న తెలంగాణ స‌ర్కారు జారీ చేసిన జీవోను స‌స్పెండ్ చేయాల‌ని విన‌తి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని పిటిష‌న్
krishna dist farmer files petition on high court

కృష్ణా జలాల్లో తెలంగాణ‌ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమ‌ని తెలంగాణ స‌ర్కారు తేల్చి చెబుతోన్న విష‌యం తెలిసిందే. అలాగే, తాము జల విద్యుదుత్పత్తిని కూడా ఆపబోమ‌ని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేప‌ట్టింద‌ని చెబుతోంది.

దీనిపై తెలంగాణ హైకోర్టులో ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హౌస్ మోష‌న్ పిటిష‌న్ వేశాడు. తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త నెల 28న తెలంగాణ స‌ర్కారు జారీ చేసిన జీవోను స‌స్పెండ్ చేయాల‌ని ఆయ‌న కోరారు. తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తూ నీటిని వ‌ద‌ల‌డం వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News