Amaravati: పుష్కరఘాట్ అత్యాచారం కేసు.. రెండు వారాలుగా పరారీలోనే నిందితులు

AP gang Rape Case police still searching for culprits
  • నిందితుల వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ పట్టుకోవడంలో జాప్యం
  • ఆరు బృందాలు గాలిస్తున్నా తప్పించుకు తిరుగుతున్న నిందితులు
  • పోలీసుల తీరుపై విమర్శలు
కాబోయే భర్తతో కలిసి సీతానగరం పుష్కర ఘాట్‌కు వెళ్లి అత్యాచారానికి గురైన ఎస్సీ యువతి కేసులో పురోగతి కనిపించడం లేదు. ఘటన జరిగిన రెండు వారాలైనా పోలీసులు ఇప్పటి వరకు నిందితుల్ని పట్టుకోలేకపోయారు. నిందితులుగా అనుమానిస్తున్న వారి చిరునామా సహా సమగ్ర వివరాలు అందుబాటులో ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు వారిని పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, ఈ కేసులో పలువురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరోవైపు, నిందితుల కోసం ఆరు బృందాలు గాలిస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులకు చిక్కకుండా నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు.
Amaravati
Pushkar Ghat
Gang Rape
Crime News

More Telugu News