తీవ్ర విషాదంలో ఉన్న నటి కవితను పరామర్శించిన 'మా' సభ్యులు

03-07-2021 Sat 19:52
  • కవిత కుటుంబంలో తీరని విషాదం
  • రెండు వారాల వ్యవధిలో కుమారుడు, భర్త మృతి
  • ఇద్దరినీ బలిగొన్న కరోనా మహమ్మారి
  • కవితను ఓదార్చిన నరేశ్ తదితరులు
MAA members condolences Kavitha
టాలీవుడ్ సీనియర్ నటి కవిత కుటుంబంలో ఇటీవల వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో కవిత కుమారుడ్ని, భర్తను పోగొట్టుకుని తీరని దుఃఖంలో మునిగిపోయారు. గత నెలలో తొలుత ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి చెందగా, కొన్నిరోజుల కిందటే భర్త దశరథరాజు కూడా కరోనాకే బలయ్యారు. దాంతో కవితకు గుండె పగిలినట్టయింది. ఆమె వేదన వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యులు ఇవాళ హైదరాబాదులో కవిత నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. మా అధ్యక్షుడు నరేశ్, కరాటే కల్యాణి తదితరులు కవితను కలిసి ఓదార్చారు.