GHMC: 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాల కోసం జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక కేంద్రాలు

  • ఇప్పటిదాకా 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు
  • ఇక యువతకు కూడా వ్యాక్సినేషన్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 100 సెంటర్లు
  • ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సేవలు
GHMC set ups vaccination centers for eighteen years plus people

దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఎప్పుడో ప్రకటించినా, టీకాల కొరతతో ఇప్పటివరకు అది సాధ్యం కాలేదు. ఇప్పటివరకు 45 ఏళ్లకు పైబడిన వారికే కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తూ వచ్చారు. ఇకపై 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా యువత కోసం 100 కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్ డోసులు వేస్తారు. ఈ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారు.

దీనిపై జీహెచ్ఎంసీ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పందిస్తూ, 18 ఏళ్లకు పైబడిన వారు తమకు సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించాలని పిలుపునిచ్చారు. ముందుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత, వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళితే వేచి చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే టీకా వేస్తారని వివరించారు.

More Telugu News