కరోనా టీకా ఒక్క డోసు తీసుకున్నా మరణాల నుంచి 92% రక్షణ: కేంద్ర ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడి
- రెండు డోసులతో 98% భద్రత
- పంజాబ్ పోలీసులపై అధ్యయనం
- వివరాలను వెల్లడించిన నీతిఆయోగ్ సభ్యుడు
35,856 మంది పోలీసులు ఒక్కడోసు వ్యాక్సిన్ తీసుకుంటే.. అందులో కరోనా సోకి 9 మంది చనిపోయారని, వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిలో కరోనాతో చనిపోయింది 0.25 శాతమేనని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న 42,720 మందిలో కేవలం ఇద్దరే (0.05%) చనిపోయారన్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకోని 4,868 మంది సిబ్బందిలో 15 మంది మృత్యువాత పడ్డారన్నారు. కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా తీవ్రత తగ్గడమే కాకుండా మరణాల ముప్పునూ గణనీయంగా తగ్గించొచ్చని, అందరూ ధైర్యంగా టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు.