మెహుల్ చోక్సీ అపహరణలో భారత్‌తో కుమ్మక్కయ్యారన్న వార్తలపై డొమినికా ప్రధాని ఆగ్రహం

03-07-2021 Sat 09:46
  • అవి పనికిమాలిన ఆరోపణలు
  • న్యాయస్థానం ముందు నిల్చున్న వ్యక్తి చేసిన నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తారా?
  • ఇలాంటి కార్యకలాపాల్లో మేం పాలుపంచుకోబోం
Dominica PM refutes on Mehul Choksi Claims

భారత ప్రభుత్వంతో కుమ్మక్కై పీఎన్‌బీ కేసు నిందితుడు మెహుల్ చోక్సీని అంటిగ్వా నుంచి డొమినికా కిడ్నాప్ చేసిందన్న వార్తలపై ఆ దేశ ప్రధాని రూజ్‌వెల్ట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి పనికిమాలిన ఆరోపణలని కొట్టిపడేశారు. ఇటువంటి కార్యకలాపాల్లో తాము పాలుపంచుకోబోమని స్పష్టం చేశారు.

న్యాయస్థానాల ఎదుట నిల్చున్న ఓ పెద్ద మనిషి చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రచారం చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ అంటిగ్వాకు పారిపోగా, ఇటీవల అక్కడి నుంచి అదృశ్యమై డొమినికాలో చిక్కాడు. అతడు పెట్టుకున్న బెయిలు దరఖాస్తును ‘ఫ్లైట్ రిస్క్’ పేరుతో అక్కడి న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు.