Hyderabad: హైదరాబాద్‌లో కలప వ్యాపారి కిడ్నాప్.. కారులో అపహరించుకుపోయిన దుండగులు

business man kidnapped in Hyderbad
  • కారులో వచ్చిన 10 మంది దుండగులు
  • సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కిడ్నాప్
  • కలపను కూడా ఎత్తుకెళ్లిన వైనం
  • ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం
హైదరాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీకి చెందిన కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని అరీఫ్ అక్బర్‌ను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కారులో వచ్చిన 10 మంది దుండగులు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి దుకాణంలో ఉన్న లక్షల రూపాయల విలువైన  కలపను కూడా ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే అరీఫ్ అక్బర్ కిడ్నాప్‌నకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Hyderabad
LB Nagar
Kidnap
Crime News

More Telugu News